సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- July 16, 2025
సలాలా: సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టు జనాన్ సలాలాలో గణనీయమైన పురోగతి ఉందని ఒమన్ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. వ్యవసాయ ఆధారిత పెట్టుబడులతో స్థిరమైన పర్యాటకాన్ని అనుసంధానించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి ఒమన్ విస్తృత వ్యూహంలో ఈ ప్రాజెక్ట్ భాగమని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులను ధోఫర్ గవర్నర్ హెచ్.హెచ్. సయ్యద్ మర్వాన్ బిన్ తుర్కి అల్ సయీద్ సమీక్షించారు. ఆయన వెంట వ్యవసాయ, జల వనరుల మంత్రి డాక్టర్ సౌద్ బిన్ హమౌద్ అల్ హబ్సి, సీనియర్ అధికారులు ఉన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సూచనలు చేశారు. వ్యవసాయ పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా ప్రకృతి దృశ్యంగా సైట్‌ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. 5.5 మిలియన్ చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ మాస్టర్‌ప్లాన్ వ్యవసాయ ఆధారిత వసతులు, కొబ్బరి, బొప్పాయి ప్రాసెసింగ్ సౌకర్యాలు, విద్యా - వినోద ప్రాంతాలు, రిటైల్ గ్రామం వంటి వాటిని కలిగిఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వారసత్వ, పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్ (ITC) లైసెన్స్‌ను పొందిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్