సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- July 16, 2025
సిరియా రాజధాని డమాస్కస్ ఒకసారి మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లింది.ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోని సైనిక ప్రధాన కార్యాలయంపై విమానదాడి చేసింది.ఈ దాడిని ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఇదే విషయాన్ని సిరియా సైనిక వర్గాలు కూడా నిర్ధారించాయి. ఈ దాడిలో రక్షణ శాఖ కార్యాలయానికి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడితో సిరియా సైనిక స్థావరాల్లో అలజడి మొదలైంది.ఇజ్రాయెల్ దాడుల తీవ్రత ఎంతవుందో నేరుగా టీవీలో ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఒక న్యూస్ యాంకర్ లైవ్‌లో వార్తలు చదువుతుండగానే బాంబు శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా పేలుళ్లు రావడంతో యాంకర్ షాక్‌కు లోనై పరుగెత్తింది. ఈ న్యూస్ స్టూడియో సమీపంలోనే రక్షణ శాఖ కార్యాలయం ఉంది. దీంతో దాడి తీవ్రత అక్కడితోనే ఆగిపోలేదన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి.
స్వెయిదా ప్రాంతంలో తెగల మధ్య రక్తపాతం
ఇక సిరియాలో మరోవైపు అంతర్గత ఘర్షణలు భయానక మలుపు తీసుకున్నాయి. స్వెయిదా ప్రాంతంలో జరిగిన తెగల మధ్య హింసాత్మక ఘర్షణలో 100 మందికిపైగా మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మైనారిటీ ద్రూజ్ మిలీషియా సభ్యులు, సున్నీ బెడ్విన్ తెగల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతంగా మారింది.ఒక కూరగాయల వ్యాపారి దోచుకునే ప్రయత్నం చేసిన ఘటనే ఈ ఘర్షణకు నాంది అయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ద్రూజ్ మిలీషియాకు చెందిన ఆ వ్యాపారిని కొన్ని సాయుధ వర్గాలు లూటీ చేయడంతో రెండు తెగల మధ్య పోరు మొదలైంది. ఇది స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా ద్రూజ్ తెగ పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ద్రూజ్ తెగకు చెందినవారు ఉన్నారు. అందులో సగం మంది సిరియాలో నివసిస్తున్నారు. మిగతా వారు లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లో జీవిస్తున్నారు. ఇప్పుడు స్వదేశంలోనే వారిపై వేటు పడుతోంది. దీంతో ఆ తెగకు చెందినవారు భద్రతపై అనేక సందేహాల్లో ఉన్నారు.ఇజ్రాయెల్ దాడులు, అంతర్గత తెగల ఘర్షణలు.. రెండూ సిరియా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఒకవైపు విదేశీ దాడులు, మరోవైపు లోపలి అసంతృప్తులు ఈ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం డమాస్కస్ నుండి స్వెయిదా వరకు భయంతో ప్రజలు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!