తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్..
- July 17, 2025
హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఊరించి మొఖం చాటేశాయి. దీంతో పెట్టిన విత్తనాలు మొలక రాక రైతులు నష్టపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మొలచిన మొక్కలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకంసైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలో గురు, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని, చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ (గురువారం) నల్గొండ , సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రేపు (శుక్రవారం) మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈనెల 19వ తేదీ వరకు అదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తూగడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!







