భారత్ లో RAKEZ ప్రతినిధి బృందం..వ్యాపార వృద్ధికి చర్చలు..!!
- July 17, 2025
రస్ అల్ ఖైమా: రస అల్ ఖైమా ఎకనామిక్ జోన్ (RAKEZ) ప్రత్యేక టీం హైదరాబాద్, ముంబై, పూణేతో సహా భారతదేశంలోని కీలకమైన నగరాల్లో వారం రోజుల పాటు జరిగిన పర్యటన ముగిసింది. RAKEZ గ్రూప్ CEO రామ్ జిల్లాద్ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం.. భారతీయ పెట్టుబడిదారులు, సంస్థలతో వ్యాపార సంబంధాలను మరింతగా పెంచుకోవడం, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పలు ఒప్పందాలు చేసుకుంది. వేలాది భారతీయ కంపెనీలకు యూఏఈ గో-టు హబ్ గా ఉందన్నారు.రస్ అల్ ఖైమాలోని తమ ఎకనామిక్ జోన్ భారతీయ పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందని అన్నారు.
అంతర్జాతీయ వ్యాపార సలహా సంస్థ TConsult నిర్వహించిన ఎక్స్పండ్ మిడిల్ ఈస్ట్ కార్యక్రమంలో ఈ ప్రతినిధి బృందం హైదరాబాద్లో పర్యటించింది. ఈ సందర్భంగా వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (WTITC) తో RAKEZ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MoU) పై సంతకం చేసింది. జల్లాద్, WTITC చైర్మన్ సందీప్ మక్తాల సంతకం చేసిన ఈ అవగాహన ఒప్పందం.. రస్ అల్ ఖైమా ద్వారా ప్రపంచ అవకాశాలను పొందేందుకు తెలుగు వ్యాపార సమాజానికి సాధికారత కల్పించడానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు.
తన పర్యటనలో భాగంగా RAKEZ బృందం ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన T-హబ్, భారతదేశంలోని అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రాలలో ఒకటైన T-వర్క్స్ ను కూడా సందర్శించింది.
ముంబైలో RAKEZ ముంబై స్టార్ట్ అప్ సన్ నర్లో యూఏఈ- ఇండియా స్టార్ట్-అప్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఇది యూఏఈ- ఇండియా CEPA కౌన్సిల్ భారతీయ స్టార్టప్లను గుర్తించి మద్దతు ఇవ్వడానికి చేపట్టిన ఒక చొరవ. మరింత ఆర్ధిక సహకారాన్ని అన్వేషించడానికి భారతదేశంలోని యూఏఈ రాయబారి డాక్టర్ అబ్దుల్నాసర్ అలారీ, CEPA కౌన్సిల్ డైరెక్టర్ అహ్మద్ అలీబి, బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హితేష్ షాతో కూడా ఈ బృందం చర్చలు జరిపింది.
RAKEZ ఇప్పటికే 9,500 మందికి పైగా భారతీయ పెట్టుబడిదారులకు నిలయంగా ఉంది.దీని వలన భారతదేశం 35,000 కంటే ఎక్కువ కంపెనీల కమ్యూనిటీకి అగ్రగామిగా నిలిచింది. మహీంద్రా, MSSL, డాబర్ నేచురల్, అశోక్ లేలాండ్, Xpro డైఎలెక్ట్రిక్ ఫిల్మ్స్ (బిర్లా గ్రూప్ భాగం) వంటి ప్రధాన భారతీయ సంస్థలు RAKEZ నుండి పనిచేస్తూ విజయం సాధించాయి. ఇది తయారీ నుండి FMCG, ఆటోమోటివ్ వరకు విస్తృత శ్రేణి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MIDC), ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC), ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ (AIAI), యూఏఈ-ఇండియా CEPA కౌన్సిల్, ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ITEO), ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA) వంటి ప్రధాన భారతీయ పరిశ్రమ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!