విల్లా అగ్నిప్రమాదం.. ఏసీ వినియోగంపై సూచనలు..!!

- July 17, 2025 , by Maagulf
విల్లా అగ్నిప్రమాదం.. ఏసీ వినియోగంపై సూచనలు..!!

దుబాయ్: దుబాయ్‌లాండ్‌లోని విల్లాలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో భద్రతా నిపుణులు కీలక సూచనలు చేశారు. ప్రజలు తమ ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, స్మోక్ అలారాలు పనిచేస్తున్నాయా లేదా నిర్ధారించుకోవాలని కోరారు.
సెరెనాలోని బెల్లా కాసాలోని ఒక బ్రిటిష్ కుటుంబానికి చెందిన విల్లాలోని పనిమనిషి గదిలో మంటలు చెలరేగాయి. ఇది AC యూనిట్‌లోని అంతర్గత విద్యుత్ లోపం కారణంగా ప్రమాదం జరిగిందని గుర్తించారు. "గదిలో ఫైర్ అలారం పనిచేయడం లేదు... ఫైర్ అలారం మోగలేదు. అది చాలా నష్టాన్ని కలిగించింది. ఇల్లు ఇప్పుడు నివసించడానికి వీలుగా లేదు. మేము ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తున్నాము" అని విల్లా టెనంట్ సాలీ మాడిసన్ అన్నారు. 

రాత్రిపూట ప్రమాదం సంభవించి ఉంటే ఫలితం వినాశకరంగా ఉండేదని, చిన్న పిల్లలతో సహా ఐదుగురు సభ్యుల బ్రిటిష్ ప్రవాస కుటుంబం అవేదన వ్యక్తం చేసింది. మాడిసన్ ప్రకారం..వారి పిల్లి మోలీ తీవ్రమైన పొగ పీల్చడం వల్ల ఇబ్బంది పడున్నారని, ఆక్సిజన్‌పై ఉంచాల్సి వచ్చిందని, ఫలితంగా పశువైద్య బిల్లులు 5,000 దిర్హామ్‌లు దాటిందని వెల్లడించారు. అలాగే, వారి లివ్-ఇన్ హెల్పర్ నెల్ తన వ్యక్తిగత వస్తువులన్నింటినీ అగ్నిప్రమాదంలో కోల్పోయిందని, అయినప్పటికీ ఆమె పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం మాత్రమే మిగిలాయని తెలిపారు.

ఏసీ, ఫైర్ అలారం తనిఖీలు కీలకం
ఎయిర్ కండిషనింగ్ యూనిట్ల క్రమం తప్పకుండా నిర్వహణ, అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించడం గురించి నిపుణులు హెచ్చరించారు. "ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేసి సర్వీస్ చేయాలి.సాధారణంగా, వేసవి నెలల్లోకి వెళ్లడానికి ఒకసారి, వేసవి తర్వాత ఒకసారి" అని రియాక్టన్ ఫైర్ సప్రెషన్ CEO సామ్ మాలిన్స్ అన్నారు.

ప్రమాదాన్ని మరింత తగ్గించడానికి, మాలిన్స్ AC యూనిట్లలో టైమర్‌ను ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. “వ్యక్తిగత ఆరోగ్యం కోసం ప్రభుత్వం 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సిఫార్సు చేస్తుంది. ఇది ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌తో కూడా ఉత్తమంగా పనిచేస్తుంది. యూనిట్‌పై తక్కువ ఒత్తిడిని కలుగజేస్తుంది. దానిని శాశ్వతంగా ఆన్ చేయకుండా ఆటోమేటిక్‌గా సెట్ చేయాలి.” అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com