గల్ఫ్ రైల్వే ప్రాజెక్టు పై GCC సెక్రటరీ జనరల్ సమీక్ష..!!
- July 17, 2025
రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సెక్రటరీ జనరల్ జాసెం అల్బుదైవి జిసిసి రైల్వే ప్రాజెక్టపై సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్ ప్రణాళిక ప్రకారం రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు.సభ్య దేశాలలో అభివృద్ధినీ పెంపొందించడంలో రైల్వే పాత్రను వివరించారు. రియాద్‌లోని జిసిసి జనరల్ సెక్రటేరియట్లో జరిగిన ఈ సమావేశంలో సెక్రటేరియట్, గల్ఫ్ రైల్వే అథారిటీ నుండి సీనియర్ అధికారులు ట్రాన్స్‌నేషనల్ రైల్వే చొరవపై తాజా అప్డేట్ లపై సమీక్షించారు. ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితి, అమలులో సాధించిన కీలక మైలురాళ్ళు, సభ్య దేశాల మధ్య కొనసాగుతున్న సమన్వయాన్ని వివరించే దృశ్య ప్రదర్శన ద్వారా అథారిటీ డైరెక్టర్ జనరల్ అల్బుదైవి వివరించారు. సభ్య దేశాలు, గల్ఫ్ రైల్వే అథారిటీలోని ప్రత్యేక బృందాలు చేసిన అధునాతన పురోగతి, ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ సమైక్యతకు కీలకమని పేర్కొన్నారు.
రైల్వే గల్ఫ్ పౌరుల ఆకాంక్షలను తీరుస్తుందని, ఈ ప్రాంతంలో ఆర్థిక, లాజిస్టికల్ కనెక్టివిటీకి కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అయ్యేలా చూసేందుకు అథారిటీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సెక్రటరీ జనరల్ కోరారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







