హరితహారం పై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం ..
- July 15, 2016
ప్రజల భాగస్వామ్యం పట్ల హర్షంమొక్కలకు నీళ్లు పోయడం, రక్షించడం చాలా ముఖ్యంసీఎం ఆదేశాలతో కలెక్టర్లకు ప్రత్యేక మెమోమొక్కలకు నీరందించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలి హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. హరితహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 'మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నాటిన మొక్కను బతికించి పెద్ద చేసేందుకు అనుసరించే కార్యాచరణను రూపొందించాలి. మొక్క నాటగానే సంబురం కాదని, అవి పెరిగి పెద్దగవడం చాలా ముఖ్యం. మొక్కలను బతికించడానికి జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. కలెక్టర్లతో సమన్వయం కుదుర్చుకుని రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ తయారు చేయాలి. ప్రతి ప్రభుత్వ శాఖ పరిధిలో కూడా ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు.. వాటికి నీళ్లు పోయడం, రక్షించడం కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని' సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్లకు ప్రత్యేక మెమో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రత్యేక మెమో జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు సెక్టార్ల వారీగా సూక్ష్మ స్థాయి ప్రణాళికా సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. వర్షాలు కురవని రోజుల్లో మొక్కలకు ఏ విధంగా నీరందిస్తారో కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సదరు కార్యాచరణ ప్రణాళికను అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి పంపాలి. ప్రతీ వారానికొక సారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు. జిల్లాలు, డివిజన్లలో అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజిన్లను మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించుకోవాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో ఉన్న మంచినీటి ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోయాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







