నేటి నుంచే WCL..

- July 18, 2025 , by Maagulf
నేటి నుంచే WCL..

లండన్: క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో సీజ‌న్ నేటి (జూలై 18, శుక్ర‌వారం) నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఛాంపియ‌న్స్ జ‌ట్టుతో పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. రాత్రి 9 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

తొలి సీజ‌న్‌లో విజేత‌గా నిలిచిన ఇండియా ఛాంపియ‌న్స్ మ‌రోసారి యువీ సార‌థ్యంలో టైటిల్ గెల‌వాల‌ని భావిస్తోంది. మొత్తం ఆరు జ‌ట్లు భార‌త్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఆగ‌స్టు 2 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం నాలుగు వేదిక‌లు.. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాల్లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com