ఖతార్ లో కొత్తగా ఐదు ఇ-సేవలు..5.38% పెరిగిన లావాదేవీలు..!!

- July 18, 2025 , by Maagulf
ఖతార్ లో కొత్తగా ఐదు ఇ-సేవలు..5.38% పెరిగిన లావాదేవీలు..!!

దోహా: ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సింగిల్ విండో ప్లాట్‌ఫామ్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) ఐదు కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది.  అదే సమయంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలలో 5.38% పెరుగుదలను(త్రైమాసిక ప్రాతిపదికన) నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రి హెచ్ ఇ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని తన అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్‌లో  పేర్కొన్నారు.

2025 రెండవ త్రైమాసికంలో రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లను పూర్తి చేయడానికి పట్టే సమయం రెండు రోజులకు తగ్గిందని (98% ఎలక్ట్రానిక్‌గా), 88% మంది కస్టమర్లు సింగిల్ విండో సేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.  అదే విధంగా సింగిల్ విండో ప్లాట్‌ఫామ్ 2025 రెండవ త్రైమాసికంలో ఐదు కొత్త ఇ-సేవలను ప్రారంభించిందని వెల్లడించారు. అన్ని సేవలను 100 శాతం డిజిటలైజేషన్ చేయడంతోపాటు 2030 వరకు 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పేటెంట్ల సంఖ్యను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com