క్యారెట్ వెయిట్ లాస్ స్మూతీ రెసిపీ:
- July 19, 2025
క్యారెట్ వెయిట్ లాస్ స్మూతీ రెసిపీ:
పదార్థాలు:
క్యారెట్ – 5 (తీసి, ముక్కలుగా కోయాలి)
ఖర్జూరాలు – 2 (నానబెట్టినవి)
బాదం – 5 (నానబెట్టినవి)
పాలు – అవసరానికి అనుగుణంగా (పాలు లేదా ప్లాంట్-బేస్డ్ మిల్క్ వాడొచ్చు)
తయారు చేయు విధానం:
కోసిన క్యారెట్ ముక్కలు, నానబెట్టిన ఖర్జూరాలు, బాదం, పాలుతో కలిపి మిక్సీ లో స్మూతీగా బ్లెండ్ చేయండి.
అవసరమైతే శానం చేసి చల్లగా సర్వ్ చేయండి.
ఆరోగ్య ప్రయోజనాలు:
విటమిన్ A, K సమృద్ధి: క్యారెట్లు వీటిలో సమృద్ధిగా ఉండటంవల్ల కళ్ల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా: క్యారెట్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాల్ని నష్టానికి నుంచి కాపాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది: క్యారెట్లలో ఉన్న ఫైబర్ మలాన్ని నియంత్రించడంలో మరియు మంచి జీర్ణక్రియ కోసం ఉపయోగపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది: క్యారెట్లలో ఉండే సాల్యూబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది: క్యారెట్లలో ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించడంతో పాటు ప్రకాశవంతంగా ఉంచుతాయి.
ఈ స్మూతీని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన బరువు తగ్గింపు మరియు శక్తివంతమైన శరీరం పొందవచ్చు.
--అను ప్రసాద్(హైదరాబాద్)
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







