ఆహార సహాయ కేంద్రాల సమీపంలో ఫైరింగ్..32 మంది మృతి..!!
- July 20, 2025
గాజా: దక్షిణ గాజాలోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు శనివారం కాల్పులు జరిపాయి. కనీసం 32 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు, స్థానిక అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల సమీపంలో కాల్పులు జరిగాయని అన్నారు. అక్కడ ఆహారం కోసం తెల్లవారుజామున నుంచే వందలాది మంది పాలస్తీనియన్లు గుమిగూడగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
గాయపడ్డవారితో నాజర్ హాస్పిటల్ నిండిపోయిందని, కీలకమైన వైద్య సామాగ్రి కూడా లేదని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి డాక్టర్ మొహమ్మద్ సాకర్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని, ఖతార్‌లో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ఎటువంటి పురోగతి సాధించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







