కువైట్ సర్వీసులు పెంచనున్న భారత విమానయాన సంస్థలు..!!
- July 20, 2025
కువైట్: కువైట్‌తో కుదిరిన విమాన సేవల ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశ దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన నెట్‌వర్క్‌లను త్వరగా విస్తరిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు 2025 నుండి కువైట్‌కు కొత్త మరిన్ని సర్వీసులను నడిపేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఇండిగో కువైట్ నగరానికి వారానికి 5,000 అదనపు సీట్లను, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరియు అకాసా ఎయిర్ సుమారు 3,000 సీట్లను, ఎయిర్ ఇండియా అదనంగా 1,500 సీట్లను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై, కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురం వంటి అధిక ప్రయాణ డిమాండ్ ఉన్న నగరాల నుండి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జూలై 21 నాటికి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని విమానయాన సంస్థలను కోరింది. జూలై 16న ఇండియా-కువైట్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు వీక్లీ సీట్ల కోటాను 12,000 నుండి 18,000కి పెరిగింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







