యూఏఈలో భారీ వర్షాలు..తగ్గిన ఉష్ణోగ్రతలు..!!
- July 21, 2025
యూఏఈ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కలిగించాయి. అల్ ఐన్‌లోని మెజియాద్, మలకిత్, అల్ హియార్, సా, ఖాట్మ్ అల్ షిక్లా, నహిల్, అల్ ఫకా, స్వీహాన్, ష్వైబ్, మసాకిన్, ఉమ్ గఫా వంటి ప్రాంతాలలో భారీ నుండి తేలికపాటి వర్షాలు కురిసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ తెలిపింది. షార్జాలోని మాడమ్, అల్ భేస్, అల్ రువైదా, ఖేదేరా, రఫాదా ప్రాంతాలలో కూడా భారీ నుండి తేలికపాటు వర్షాలు కురిశాయి. దుబాయ్-అల్ ఐన్ రోడ్, అల్ ఐన్ యొక్క ఉమ్ గఫా రోడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న దృశ్యాలను స్టార్మ్ సెంటర్ షేర్ చేసింది. కొన్ని తూర్పు, దక్షిణ ప్రాంతాలలో గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ఈమేరకు కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరేంజ్, ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, ఎలక్ట్రానిక్ బోర్డులపై ప్రదర్శించబడే వేరియబుల్ వేగ పరిమితులను పాటించాలని అబుదాబి పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







