లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి గా అదరగొట్టిన ఆనంది

- July 21, 2025 , by Maagulf
లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి గా అదరగొట్టిన ఆనంది

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనందీ మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా చూపించబోతోంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.

తాజాగా విడుదలైన గ్లింప్స్ వింటేజ్ వైబ్ తో అదిరిపోయింది. ఊరి స్టేజీలు, జనం కేరింతలు, ఫోక్ ఐకాన్ గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో గ్లింప్స్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.

లక్ష్మిగా ఆనందీ పెర్ఫార్మెన్స్  అద్భుతంగా వుంది. 15 ఏళ్లలో 10,000 స్టేజీలను తాకిన గాయనీ జీవితాన్ని రిక్రియేట్ చేసింది. ఆమె పాటలు వింటూ ఎదిగిన 90స్ తరం మళ్లీ అలానే ఫీల్ అవుతుంది. ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన రోజులను గుర్తు చేస్తుంది.

చరణ్ అర్జున్ అందించిన నేపథ్య సంగీతం ఆ విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేసింది. పాటలు, సంగీతం, ఆర్ట్– ఇవన్నీ కలసి ఈ గ్లింప్స్‌ని అద్భుతంగా మార్చాయి.

‘గరివిడి లక్ష్మి’ మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా.

ఈ సినిమా సినిమాటోగ్రఫీని జె. ఆదిత్య. ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది.

తారాగణం:  నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని

సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
సినిమాటోగ్రాఫర్ (DOP): J. ఆదిత్య
సంగీతం: చరణ్ అర్జున్
చీఫ్ కోఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాతాడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ చౌదరి కొల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సుకుమార్ కిన్నెర,
asst. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: దుర్గా ప్రసాద్, క్రాంతి కుమార్ దత్తి
ప్రొడక్షన్ కంట్రోలర్: విశ్వేష్ అంపోలు, దాసరి రాజు బాల కృష్ణ
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com