కువైట్ లో భారీగా తగ్గిన ఇండియన్ మేల్ వర్కర్స్..!!
- July 22, 2025
కువైట్: కువైట్ గృహ కార్మిక మార్కెట్‌లో పెద్ద మార్పులు సంభవించాయి. ఫిలిప్పీన్స్ గృహ కార్మికులలో గణనీయమైన సంఖ్యలో దాదాపు 44వేల మంది మహిళలు(25%) మార్చి 2024-మార్చి 2025 మధ్య మార్కెట్ నుండి నిష్క్రమించారు. వారి స్థానంలో, ఇతర దేశాల నుండి కొత్తగా కార్మికులు వచ్చి చేరారు. ముఖ్యంగా 21,000 మంది నేపాలీలు, 14,000 మంది శ్రీలంకన్లు కువైట్ కు వచ్చారు.
సెంట్రల్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో మాలి, బెనిన్ వంటి ఆఫ్రికన్ దేశాల నుండి మహిళా గృహ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొంది. మాలి నుండి కార్మికుల సంఖ్య రెట్టింపు కాగా, బెనిన్ వర్క్ ఫోర్స్ లో 3,737 మంది కార్మికులు పెరిగారు.
ఇక గృహ రంగంలో భారతీయ పురుష కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. గత ఏడాది కాలంలోనే వారి సంఖ్య 35,000 కంటే ఎక్కువ తగ్గిందని పేర్కొంది. మార్చి 2024లో 248,000 ఉండగా, మార్చి 2025 నాటికి వారి సంఖ్య 212,000కి తగ్గింది. ఇదే సమయంలో సూడాన్ మేల్ కార్మికులు కువైట్ ఇళ్లలో పనిచేసే టాప్ 10 దేశాలలో చోటు సంపాదించారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







