IBPS పీఓ, ఎస్ఓ దరఖాస్తు గడుపు పొడగింపు..
- July 22, 2025
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికోసం ఐబీపీఎస్ ఇటీవలే పీఓ, ఎస్ఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ పోస్టుల కోసం అప్లై చేసుకున్నారు.అయితే దరఖాస్తు గడువు ముగుస్తున్న వేళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సంస్థ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.అదేంటంటే తాజాగా దరఖాస్తు గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది.గడువు తేదీని జులై 28, 2025గా నిర్ణయించింది.ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://ibps.in నుంచి రిజిస్ట్రేషన్ లింక్‌ను పొందవచ్చు.అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు:
ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు 5208. దరఖాస్తు లింక్: https://ibpsreg.ibps.in/crppoxvjun25/
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 1007. దరఖాస్తు లింక్: https://ibpsreg.ibps.in/crpspxvjun25/
ఇలా అప్లై చేసుకోండి:
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://ibps.inలోకి వెళ్ళాలి
- హోమ్ పేజీలో ఐబీపీఎస్ పీఓ లేదా ఐబీపీఎస్ ఎస్ఓ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ ‘అప్లై ఆన్‌లైన్’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై నొక్కాలి
- రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది
- పర్సనల్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి
- దరఖాస్తును పూర్తి చేయాలి
- దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
- తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
- పేజీని సేవ్ లేదా డౌన్‌లోడ్ చేసుకోవాలి
- దరఖాస్తు రుసుము:
- జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్ రెండు పోస్టులకూ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష ఉంటాయి. ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!