యూఏఈలో 77 సోషల్ మీడియా ఖాతాలు మూసివేత..!!
- July 23, 2025
యూఏఈ: ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లైసెన్స్ లేని గృహ కార్మికుల నియామకంలో పాల్గొన్న 77 సోషల్ మీడియా ఖాతాలను యూఏఈలోని అధికారులు మూసివేసారు. ఈ ఖాతాలు అవసరమైన లైసెన్స్‌లు లేకుండా గృహ కార్మికుల నియామక సేవలను ప్రోత్సహిస్తున్నాయని దర్యాప్తులో తేలిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది.
యజమానులు , కుటుంబాలు లైసెన్స్ పొందిన లేదా ఆమోదించబడిన గృహ కార్మికుల నియామక ఏజెన్సీలతో మాత్రమే పాల్గొనాలని మంత్రిత్వ శాఖ కోరింది. యూఏఈలో వారి పేర్లు, ఏజెన్సీల జాబితా MoHRE వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపింది.
"లైసెన్స్ లేని గృహ కార్మికుల నియామక సంస్థలు, గృహ కార్మికుల సేవలను ప్రోత్సహించే విశ్వసనీయత లేని సోషల్ మీడియా పేజీల కారణంగా బాధితులు వారి చట్టపరమైన హక్కులను కోల్పోయే అవకాశం ఉంది. వారు మంత్రిత్వ శాఖ-లైసెన్స్ పొందిన, ఆమోదించబడిన ఏజెన్సీలను మాత్రమే తమ సేవల కోసం ఎంచుకోవాలి." అని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!