ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- July 24, 2025
హైదరాబాద్: తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో నాయకులు కేక్ కట్ చేసి జయజయకారాలతో సంబరాలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులకు కేటీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తనపై ప్రేమను చాటిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.తన పుట్టినరోజు వేళ అందరి ప్రేమాభిమానాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొనగలగడం ఆనందంగా ఉందని కేటీఆర్ చెప్పారు.అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు తనపై ఉన్న విశ్వాసాన్ని చూపుతున్నాయని, ఆ రుణం మాటల్లో చెప్పలేనిదని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







