చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్..
- July 24, 2025
భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ అరుదైన ఘనత సాధించింది. ఫిడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.సెమీఫైనల్లో 19 ఏళ్ల దివ్య మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ తాన్ జోంగ్యిపై 1.5-0.5 తేడాతో గెలుపొందింది.ఈ ప్రదర్శనతో దివ్య 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. అంతేకాదండోయ్.. తొలి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ను కూడా సాధించింది.
మంగళవారం సెమీస్ తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన దివ్య డ్రాగా ముగించింది.బుధవారం రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడి ప్రత్యర్థిని మట్టి కరిపించింది. తాన్ జోంగ్యి తప్పులను తనకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించింది.
ఇదిలా ఉంటే..మరో సెమీఫైనల్లో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చెనాకు చెందిన లీ టింగ్జీతో తలపడింది.వరుసగా రెండు గేమ్‌లు డ్రాగా ముగిశారు. దీంతో గురువారం వీరిద్దరు టైబ్రేక్స్ గేమ్స్ ఆడతారు.గెలిచిన వారు ఫైనల్‌కు చేరుకుంటారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







