WR0 2025కి ప్లాటినం స్పాన్సర్‌గా జీఎంఆర్ ఏరోసిటీ

- July 24, 2025 , by Maagulf
WR0 2025కి ప్లాటినం స్పాన్సర్‌గా జీఎంఆర్ ఏరోసిటీ

హైదరాబాద్: విశిష్టమైన గౌరవాన్ని కలిగిన వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ (WRO) ఇండియా నేషనల్ ఛాంపియన్‌షిప్ 2025 ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 మరియు 6 తేదీలలో జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్‌లోని అత్యాధునిక సదుపాయాలతో నడిచే జీఎంఆర్ అరెనాలో జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ప్లాటినం స్పాన్సర్‌గా జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ తోడైంది. దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభావంతుల రోబోటిక్స్ లోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది వేదికగా నిలుస్తుంది.

“The Future of Robots” అనే థీమ్‌తో సాగనున్న WRO ఇండియా 2025 సీజన్‌కు ఇది ఫైనల్ ఈవెంట్. విజేతలు సింగపూర్‌లో జరగనున్న అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందుతారు.

జీఎంఆర్ గ్రూప్‌లో ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ సీఈఓ అమన్ కపూర్ మాట్లాడుతూ,
“జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్‌లో మేము యువతలో ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్‌కు సిద్ధమైన మైండ్‌సెట్‌ను ప్రోత్సహించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడాన్ని గర్వంగా భావిస్తున్నాము. WRO ఇండియాతో భాగస్వామ్యం చేయడం ద్వారా విద్య, సాంకేతికత మరియు సహకారం కలిసే వాతావరణాన్ని రూపొందించాలన్న మా కృషిని ప్రతిబింబిస్తోంది. దేశంలోని అత్యుత్తమ యువ ఆవిష్కారకులను హోస్ట్ చేయడం మా గౌరవం,” అని తెలిపారు.

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) సీఈఓ ప్రదీప్ పనిక్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,“WRO ఇండియా నేషనల్ ఛాంపియన్‌షిప్ 2025 కార్యక్రమం సాంకేతిక విద్య (STEM) ప్రాముఖ్యతను హైలైట్ చేయడంతో పాటు, GMR గ్రూప్ సమాజాభివృద్ధి మరియు ఆవిష్కరణపై పెట్టుబడికి అనుగుణంగా ఉంది.GHIAL వద్ద, మేము రోబోటిక్స్ రంగంలో స్టార్టప్‌లతో కలిసి పని చేస్తూ GMR ఇన్నోవేక్ష ద్వారా భవిష్యత్తుకు సిద్ధమైన పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాము.ఈ వేదిక యువ ప్రతిభావంతులను గుర్తించేందుకు మరియు భవిష్యత్తు భాగస్వామ్యాల కోసం మాకు మంచి అవకాశం కల్పిస్తుంది,” అన్నారు.

ఇండియా స్టెమ్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు WRO ఇండియా జాతీయ నిర్వాహకుడు  సుధాంశు శర్మ మాట్లాడుతూ, “WRO ఇండియాకు జీఎంఆర్ ఏరోసిటీ భాగస్వామ్యం ఎంతో విశిష్టమైన మైలురాయిగా నిలిచింది.భవిష్యత్‌ను నిర్మించే యువ ఆవిష్కారకులకు వాతావరణం కల్పించాలన్న వారి దృష్టికోణం, మా లక్ష్యాలకు పూర్తిగా అనుసంధానంగా ఉంది. టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో జాతీయ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం ఎంతో ఉత్సాహభరితమైన విషయం,” అని పేర్కొన్నారు.

WRO ఇండియా 2025 సీజన్

ఈ సంవత్సరం వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ 19వ సంవత్సరం జరుపుకుంటోంది. 8 నుండి 19 ఏళ్ల వయస్సున్న విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పోటీ, రోబోటిక్స్ మరియు ప్రాధమిక సాంకేతికతలపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.విద్యార్థులు ఆటోనమస్ రోబోటిక్ పరిష్కారాలను డిజైన్ చేయడం, ప్రోగ్రామ్ చేయడం ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారానికి తమ ఆలోచనలు సమర్పించాలి.ఈ పోటీ విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, మరియు జట్టు సమన్వయంతో కూడిన సమస్యల పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది విద్యార్థులకు STEM రంగాలలో ప్రాక్టికల్ అనుభవాన్ని కల్పించే అరుదైన అవకాశం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com