డ్రగ్స్ ని తరిమికొడదాం…డయల్ టోల్ ఫ్రీ నంబర్ 📞1972

- July 24, 2025 , by Maagulf
డ్రగ్స్ ని తరిమికొడదాం…డయల్  టోల్ ఫ్రీ నంబర్ 📞1972

అమరావతి: మాదకద్రవ్యాల వినియోగం అనేది వ్యక్తిగతంగా మాత్రమే కాక సమాజానికీ చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగించే సమస్య. ఇవి శరీరాన్ని మానసికాన్ని తీవ్రంగా నష్టపరిచే ప్రభావాన్ని చూపుతాయి. మత్తు పదార్థాల వినియోగం వల్ల నర్వస్ సిస్టమ్ పై భయంకరమైన ప్రభావం పడుతుంది.మత్తు పదార్థాలు తాత్కాలిక ఆనందం కలిగించవచ్చు కానీ అవి జీవితాన్ని నాశనం చేస్తాయి. దయచేసి డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.యువత మేలుకోవాలి.పోలీస్ శాఖ ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పరచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈగల్ సెల్స్ ను ఏర్పాటు చెయ్యడం జరిగినది గంజాయి ఎవరైనా సేవిస్తున్నా లేదా అక్రమరవాణా చేస్తున్న మీ విలువైన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి మీ సమాచారాన్ని తెలుపగలరు.మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com