దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూత..
- July 24, 2025
దిగ్గజ రెజ్లర్, రెజ్లింగ్ ఐకాన్, WWE హాల్ ఆఫ్ ఫేమర్ హల్క్ హోగన్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్ తో హల్క్ మృతి చెందారు. అమెరికా ఫ్లోరిడాలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారాయన. 1953లో జన్మించిన హల్క్ హోగన్.. 1980ల్లో గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మీసాలు హల్క్ హోగన్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టాయి. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌ను బిలియన్ డాలర్ల వినోద పరిశ్రమగా మార్చడంలో హల్క్ హోగన్ సాయపడ్డారు.
“WWE హాల్ ఆఫ్ ఫేమర్ హల్క్ హోగన్ మరణించారని తెలిసి WWE చాలా బాధగా ఉంది. పాప్ సంస్కృతిలో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరైన హోగన్, 1980లలో WWE ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించడంలో సాయపడ్డాడు. హోగన్ కుటుంబానికి, స్నేహితులు, అభిమానులకు WWE తన సంతాపాన్ని తెలియజేస్తోంది” అని WWE ఒక ప్రకటనలో తెలిపింది.
గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు సంబంధించిన కాల్ రావడంతో ఫ్లోరిడాలోని క్లియర్ వాటర్‌లోని హోగన్ నివాసానికి అత్యవసర వైద్య సేవలు వెళ్లాయి. ఆయన ఇంటి బయట పోలీసు బృందాలు, EMTలు కనిపించాయి. WWE లెజెండ్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి అంబులెన్స్‌లోకి ఎక్కించారు. కొన్ని వారాల క్రితమే మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇప్పుడిప్పుడే హోగన్ కోలుకుంటున్నారు. ఇంతలోనే ఇలా జరిగిపోయిందని కుటుంబసభ్యులు, స్నేహితులు వాపోయారు.
హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ బోలియా. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో అత్యంత గుర్తింపు పొందిన వారిలో ఒకరు. 1980, 90లలో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తనదైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షించారు. ప్రపంచవ్యాప్తంగా WWE (అప్పటి WWF) ప్రాచుర్యం పొందడంలో కీ రోల్ ప్లే చేశారు.
ఆగస్టు 11, 1953న జార్జియాలోని ఆగస్టాలో హోగన్ జన్మించారు. ఫ్లోరిడాలోని టంపా ప్రాంతంలో పెరిగారు. ప్రారంభంలో స్థానిక రాక్ బ్యాండ్‌లకు బాస్ గిటారిస్ట్‌గా ఉన్నారు. 1970లలో ఫ్లోరిడాలో పాపులర్ అవుతున్న రెజ్లింగ్ కి ఆకర్షితుడయ్యారు. దాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు.
ఆ సమయంలో టీవీలో వచ్చిన కామిక్ పుస్తక పాత్ర హల్క్.. పోలికలను టెర్రీలో అభిమానులు గమనించారు. అలా ఆయనకు “హల్క్” అనే మారుపేరు వచ్చింది. ఆ తర్వాత WWF ప్రమోటర్ విన్సెంట్ జె. మెక్‌మహాన్ ఆయనకు “హోగన్” అనే ఇంటిపేరును ఇచ్చారు. అలా టెర్రీ బోలియా కాస్తా హల్క్ హోగన్ గా పాపులర్ అయ్యారు. ఆయన మొదట అనేక రెజిల్‌మేనియా ఈవెంట్‌లలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ కవర్‌పై కనిపించారు. ఇది ఆ సమయంలో ఒక రెజ్లర్‌కు అరుదైన ఘనత.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!