బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే
- July 24, 2025
ఓ సాలిడ్ హిట్ తో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చాలాకాలంగా ఆరాటపడుతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్ లో ఇప్పటి వరకూ రాక్షసుడు మాత్రమే బ్లాక్ బస్టర్. మిగతావాటిలో చాలా వరకూ పోయాయి. కొన్ని కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రాబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన భైరవంలో తనే మెయిన్ లీడ్ అయినా.. ఆ మూవీ ఖలేజా రీ రిలీజ్ వెల్లువలో కొట్టుకుపోయింది. బట్ ఓటిటిలో మాత్రం రికార్డ్ స్థాయిలో దుమ్మురేపుతోంది. నెక్ట్స్ వరుసగా టైసన్ నాయుడు, హైందవం, కిష్కింద పురి చిత్రాలున్నాయి. వీటిలో అన్నికంటే ముందు కమిట్ అయిన సినిమా టైసన్ నాయుడు. కానీ అదెందుకో బాగా ఆలస్యం అవుతోంది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడా సినిమాను. ఇక ఆ మధ్య విడుదలైన హైందవం గ్లింప్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. హిందూ పురాణాల ప్రకారం దశావతారాల కాన్సెప్ట్ తో వచ్చిందా వీడియో. బాగా ఆకట్టుకుంది కూడా. ఇక మిగిలింది కిష్కింద పురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ నే అనౌన్స్ చేశారు. కిష్కింద పురి టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు వచ్చిన గ్లింప్స్ సైతం అదిరిపోయింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా అని అర్థం అయింది. ఈ చిత్రాన్నే సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. సెప్టెంబర్ లో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 5న తెలుగు నుంచి మిరాయ్ తో పాటు తమిళ్ డబ్బింగ్ మూవీస్ గా మధరాసి, భద్రకాళి చిత్రాలున్నాయి. చివరి వారంలో పవన్ కళ్యాణ్ ఓ.జి, సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటి గట్టు చిత్రాలున్నాయి. ఈ మధ్యలో కిష్కింద పురి అంటే మంచి డేట్ అనే చెప్పాలి. కాకపోతే అదే డేట్ కు అనుష్క నటించిన ఘాటీ కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ యేడాది రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు సాయిశ్రీనివాస్. పైగా రాక్షసుడు తర్వాత అనుపమతో జోడీ కట్టిన సినిమా కాబట్టి అంచనాలూ ఉంటాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!