ప్రియాంకా గాంధీతో సీఎం రేవంత్ భేటీ
- July 25, 2025
న్యూ ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు ప్రియాంకా గాంధీని కలిసారు.ఈ భేటీ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన కులగణన సర్వే అంశంపైనే జరిగినట్లు తెలుస్తోంది.రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేలా చేపట్టిన ఈ కులగణన ప్రక్రియను ప్రియాంకా గాంధీకి వివరించినట్లు సీఎం రేవంత్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ సందర్భంగా సర్వే ద్వారా తెచ్చిన కీలక అంశాలను వివరించి, దీనివల్ల రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుందో వివరించారు.
కులగణన సర్వే అనంతరం రాష్ట్రంలో బీసీలకు (OBCs) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి కూడా ప్రియాంకా గాంధీకి వివరించారు. ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో విశేషంగా హర్షాతిరేకాలు కలిగిస్తుందని భావిస్తున్నారు.విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో సామాజిక న్యాయం అందించేందుకు ఈ రిజర్వేషన్లు కీలకమవుతాయని రేవంత్ చెప్పారు. ప్రియాంకా గాంధీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటంలో మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో చేపట్టిన కులగణన, బీసీలకు రిజర్వేషన్ల విధానం దేశమంతటా చర్చనీయాంశమవుతోంది.ఇది కేవలం ఒక రాష్ట్ర కార్యక్రమం కాదని, సామాజిక న్యాయంపై దేశానికి మార్గనిర్దేశం చేసే తెలంగాణ మోడల్ గా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి నిలబడి తెలంగాణలో అమలు చేసిన ఈ నిర్ణయానికి ప్రియాంక గాంధీ మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి