రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన కమల్‌హాసన్

- July 25, 2025 , by Maagulf
రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన కమల్‌హాసన్

చెన్నై: రాజ్యసభ ఎంపీగా సినీనటుడు కమలహాసన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.తమిళంలో ఆయన చేసిన ప్రమాణస్వీకారం పలువురిని ఆకట్టుకుంది. డీఎంకే పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం విధితమే. ఇటీవల కన్నడభాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఓ సినిమా ప్రమోషన్ సమావేశంలో కన్నడభాషను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేకిత్తించాయి.కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో అతని సినిమాలను బ్యాన్ చేస్తామని కన్నడ ప్రజలు హెచ్చరించారు. అతనిపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.మొదటినుంచి వివాదాస్పదకుడి కమల్‌హాసన్ పేరుంది. ఏదీఏమైనా ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడం సినీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. రాజ్యసభలో కమలహాసన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడంతో భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com