25యాప్స్, వెబ్సైట్లపై కేంద్రం నిషేధం..
- July 25, 2025
న్యూ ఢిల్లీ: ఓటీటీ వేదికల్లో విచ్చలవిడి అభ్యంతరకర కంటెంట్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న కొన్ని యాప్స్, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది.మొత్తం 25 యాప్‌లు, వెబ్ సైట్లపై కేంద్రం ఈ నిషేధం విధించింది. ఆయా వెబ్ సైట్లను కనిపించకుండా చేయాలని, దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, దేశీప్లిక్స్, గులాబ్ యాప్ వంటివి పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించి తమ యాప్స్ ద్వారా అశ్లీల కంటెంట్ ను ప్రచారం చేస్తున్నాయని గుర్తించాం. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన రక్షణను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఓటీటీ ప్రసార యాప్ లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు వారు ప్రసారం చేసే కంటెంట్ పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్ ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది.
తొలిగించినవి ఇవే..
ఉల్లు, ఏఎల్టీటీ, బుల్ యాప్, గులాబ్ యాప్, కంగన్ యాప్, నవరస లైట్, బూమెక్స్ , బిగ్ షాట్స్, దేశీప్లిక్స్, జాల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, ఫినియో, షో ఎక్స్, హిట్ ప్రైమ్, సోల్ టాకీస్, హాట్ఎక్స్ వీఐపీ, అడ్డా టీవీ, హల్చల్ యాప్, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్, ట్రైప్లిక్స్, నియాన్ ఎక్స్ వీఐపీ, కంగన్ యాప్, మూడ్ఎక్స్ వంటి యాప్స్, వెబ్సైట్లు ఉన్నాయి.
ఈ యాప్‌లు, వెబ్సైట్లు ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 67 మరియు సెక్షన్ 67A, ఇండియన్ జస్టిస్ కోడ్, 2023లోని సెక్షన్ 294 మరియు మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986లోని సెక్షన్ 4తో సహా అనేక నియమాలను ఉల్లంఘిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ యాప్‌లు, వెబ్సైట్లను నిషేధించాలని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..