10వ లోకల్ డేట్స్ ఫెస్టివల్.. 116 ఫామ్‌లతో ప్రారంభం..!!

- July 25, 2025 , by Maagulf
10వ లోకల్ డేట్స్ ఫెస్టివల్.. 116 ఫామ్‌లతో ప్రారంభం..!!

దోహా: 10వ లోకల్ డేట్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది.  ఆకర్షణీయమైన ధరలకు అనేక రకాల తాజా డేట్స్‌ను అందిస్తోంది.  రెండు వారాల వేడుక, ఖతార్ వ్యవసాయ రంగానికి మద్దతును అందిస్తుంది. జూలై 24 నుండి ఆగస్టు 7 వరకు జరిగే ఈ ఫెస్టివల్ సౌక్ వకీఫ్ తూర్పు స్క్వేర్‌లో జరుగుతుంది. వారపు రోజులలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, శుక్రవారాలు, శనివారాల్లో రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.

ఈ ఫెస్టివల్‌ను మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలో వ్యవసాయ వ్యవహారాలు, ఆహార భద్రత కోసం అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఇంజనీర్ ఫహద్ మొహమ్మద్ అల్-ఖహ్తానీ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కార్యాలయం ప్రతినిధి అబ్దుల్‌రెహ్మాన్ మొహమ్మద్ అల్-నామా ప్రారంభించారు. పలువురు ముఖ్యమైన నేతలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎడిషన్‌లో 100 కి పైగా స్థానిక ఫామ్స్ ప్రతినిధుల  ప్రదర్శనలు ఉన్నాయ. ఇది ఖతార్‌లోని అత్యంత ముఖ్యమైన వ్యవసాయ కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని వక్తలు తెలిపారు.  జాతీయ ఆహార భద్రతా వ్యూహం 2030లో భాగంగా మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఖర్జురాలను ఉత్పత్తి చేసే ఫామ్స్ లకు మద్దతు ఇస్తుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com