ఫార్మసీ చట్టాల ఉల్లంఘన..20 ఫార్మసీలు సీజ్..!!

- July 25, 2025 , by Maagulf
ఫార్మసీ చట్టాల ఉల్లంఘన..20 ఫార్మసీలు సీజ్..!!

కువైట్ : ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో వాణిజ్య,  పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన సమన్వయ తనిఖీ ప్రచారంలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన 20 ఫార్మసీలను మూసివేసింది. 

వివిధ గవర్నరేట్‌లలో గురువారం నిర్వహించిన ప్రచారం తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపింది. దీనిపై తక్షణ చర్యలు తీసుకున్నారని, ఇందులో భాగంగా ఆయాఫార్మసీలను సీజ్ చేసినట్లు రెండు మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. వీటితోకలిపి ఇప్పటివరకు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన 60 ఫార్మసీలను మూసివేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఉల్లంఘనలలో ప్రధానంగా లైసెన్స్ లేని వ్యక్తులు లేదా థర్డ్ పార్టీ నిర్వహించే ఫార్మసీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న లైసెన్స్‌లను రద్దు చేసి, అటువంటి సంస్థలను మూసివేయడం వంటి చర్యల చట్టబద్ధతను కాసేషన్ కోర్టు గతంలో ధృవీకరించింది. లైసెన్స్‌లను రద్దు చేయడం, తదుపరి న్యాయపరమైన చర్యల కోసం కొన్ని కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com