బిగ్ టికెట్ ఇ-డ్రా: Dh50,000 గెలుచుకున్న నలుగురు ప్రవాసులు..!!
- July 26, 2025
యూఏఈ: ఈ వారం బిగ్ టికెట్ ఇ-డ్రాలో నలుగురు అదృష్టవంతులైన ప్రవాసులు విజేతలుగా నిలిచారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ఒక బంగ్లాదేశీయుడు ఉన్నాడు. వీరు ఒక్కొక్కరు Dh50,000 చొప్పున గెలుచుకున్నారు.
గత ఏడు సంవత్సరాలుగా దుబాయ్లో నివసిస్తున్న కేరళకు చెందిన 32 ఏళ్ల అజై కృష్ణకుమార్ జయన్, ఒక సంవత్సరం క్రితం సోషల్ మీడియా ద్వారా బిగ్ టికెట్ గురించి మొదటిసారి విన్నాడు. అప్పటి నుండి, అతను 10 మంది స్నేహితుల గ్రూపుతో కలిసి టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాడు. వచ్చిన నగదును గ్రూపు మొత్తం పంచుకుంటామని తెలిపారు.
హైదరాబాద్కు చెందిన 39 ఏళ్ల భద్రతా అధికారి సమీర్ అహ్మద్, ప్రస్తుతం సౌదీ అరేబియాలో గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. మూడు నెలల క్రితం యూట్యూబ్లో ఒక ప్రమోషనల్ వీడియో ద్వారా బిగ్ టికెట్ గురించి తెలుసుకుని కొనుగొలు చేస్తున్నాడు. సమీర్ కూడా కొనసాగుతున్న బండిల్ ఆఫర్లో పాల్గొన్నాడు. దీని ద్వారా అతనికి 3 టిక్కెట్లు లభించాయి. అతని అదృష్ట విజయం ఉచిత టికెట్ నుండి వచ్చింది.ఇండియా నుండి వచ్చిన సుష్మిత, రెండు టిక్కెట్లను కొనుగోలు చేసి, కొనసాగుతున్న బండిల్ ఆఫర్లో భాగంగా ఒక అదనపు టికెట్ను ఉచితంగా పొందింది. 277-044870 నంబర్ ఉచిత టికెట్ ఆమెకు విజయాన్ని అందించింది.
మూడు వారపు ఈ-డ్రాలు ఇప్పటికే ముగిశాయి. ఆగస్టు 3న అబుదాబిలో ప్రత్యక్షంగా గ్రాండ్ ప్రైజ్ డ్రా జరగడానికి చివరి వారం మిగిలి ఉంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!