దుబాయ్ లో కొకైన్ సేల్.. ఇద్దరికి జీవిత ఖైదు..!!
- July 26, 2025
దుబాయ్: కొకైన్ అమ్ముతూ దొరికిన ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దుబాయ్ పోలీసుల కథనం ప్రకారం.. స్టింగ్ ఆపరేషన్‌లో ఒక రహస్య ఏజెంట్‌కు కొకైన్ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా వీరిని అరెస్టు చేశారు. విశ్వసనీయ నిఘా సమాచారం మేరకు అనుమానితులను పట్టుకోవడానికి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ ఉన్న వ్యక్తిని ముందుగా పోలీస్ సిబ్బంది ఒకరు సంప్రదించాడు.
ప్రధాన నిందితుడు మోటార్‌బైక్‌పై ముందుగా తలిపిన ప్రదేశానికి తన సహచరుడితో పాటు వచ్చాడు. మొదటి నిందితుడు కొకైన్‌ను అమ్మగానే , పోలీసు బృందం రంగంలోకి దిగింది. అధికారులు విక్రేతను పట్టుకోగా, రెండవ నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. వారి నివాసం నుండి 32 డ్రగ పిల్స్, కొంత మొత్తంలో క్రిస్టల్ మెత్ ను గుర్తించి వాటిని సీజ్ చేశారు. సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా కోర్టు నిందితులకు జీవితఖైదు విధించింది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్