ముంబైని ముంచెత్తనున్న భారీ వర్షాలు: IMD హెచ్చరిక
- July 26, 2025
ముంబై: భారీ వర్షాలు ముంబై నగరాన్ని మళ్లీ ముంచెత్తనున్నాయి. ఇప్పటికే ముంబై, థానే, రాయ్‌గడ్, పుణె, సతారా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.సిటీలో జూలై 27వ తేదీ ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తన హెచ్చరికలో వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ముంబై తీరం వెంట సుమారు 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీయనున్నది. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లోనే వర్ష బీభత్సం కొనసాగనున్నది.
ప్రజలు ఎవరూ బయట తిరగవద్దు అని ఐఎండీ పేర్కొన్నది. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సమీప జిల్లాలకు కూడా ఈ అలర్ట్ ఇచ్చారు. ఆదివారం ఉదయం వరకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగనున్నది. రాయ్‌గడ్ జిల్లాకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం ఉదయం వరకు మాత్రం పాల్గర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అలలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వర్షం వల్ల ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే జామైంది.రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు బీఎంసీ వర్కర్లు రంగంలోకి దిగారు.
భారతదేశంలో అతి పెద్ద వరద ఏది?
1954లో గంగా నదిపై ఇప్పటివరకు సంభవించిన అత్యధిక వరద 72 900 m J s”‘ గా నమోదైంది. 1000 కిమీ 2 కంటే తక్కువ ఉన్న ప్రాంతాలకు, భారతదేశంలో అత్యధిక వరదలు తీవ్రతలో చాలా తక్కువగా ఉంటాయి.
ముంబైలో ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతం ఏది?
భారీ వర్షాకాలంలో పోవై ప్లాజా మరియు హిరానందని ఆసుపత్రి కింద ఉన్న ప్రాంతాలు నీటితో నిండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ముంబైలో అతిపెద్ద వరద ఎప్పుడు వచ్చింది?
జూలై 26, 2005 న, మధ్యాహ్నం 2:00 గంటల ప్రాంతంలో, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం తీవ్రమైన తుఫాను మరియు దాని తరువాత వచ్చిన వరదలతో అతలాకుతలమైంది. శాంటాక్రూజ్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) స్టేషన్ 944 మిల్లీమీటర్లు (37.2 అంగుళాలు) నమోదైంది. ముంబైలో ఇది రికార్డు స్థాయిలో అత్యంత వర్షపాతం నమోదైన రోజు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..