టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్-విజయ భాస్కర్
- July 26, 2025
విజయ భాస్కర్....ఈ జనరేషన్ ఆడియన్స్‌కు ఈ పేరుతో పరిచయం లేకపోవచ్చు కానీ మిలీనియం ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.ఎందుకంటే అప్పట్లో ఈయన పేరు సంచలనం.ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఖాయం. అప్పట్లో ఆయన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించేవి. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలను బహుమతిగా ఇచ్చారు ఈ దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ జతగా ఈయన చేసిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు లాంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి.నేడు సుప్రసిద్ధ దర్శకుడు విజయ భాస్కర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
కె.విజయ భాస్కర్ అలియాస్ కుంభకోణం విజయ భాస్కర్ జూలై 26న ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో జన్మించారు.కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరి ప్లస్ టూ వరకు చదువుకున్నారు.ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఏడేళ్ల పాటు ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు.చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండటంతో ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాస్ వెళ్లారు.అక్కడ ఉన్న సమయంలోనే పలు దర్శకుల వద్ద పనిచేశారు.పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన భాస్కర్ సైతం తన మకాం భాగ్యనగరానికి మార్చారు. ఇక్కడ ఉన్న సమయంలోనే భీమవరానికి చెందిన రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం అయ్యారు.
భాస్కర్ తన తొలి చిత్రాన్ని నటుడు తొట్టెంపూడి వేణు హీరోగా 1999లో స్వయంవరం చిత్రాన్ని తీశారు. త్రివిక్రమ్ డైలాగ్స్ బాగా పేలడం వల్ల ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ ఉషాకిరణ్ మూవీస్ పతాకంలో నువ్వే కావాలి చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ రెండు చిత్రాల విజయంతో భాస్కర్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి, నాగార్జున హీరోగా మన్మధుడు చిత్రాలతో భారీ హిట్స్ ఇచ్చారు. ఫ్లాప్ అయినా కూడా జై చిరంజీవ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత విజయ్ భాస్కర్ తెరకెక్కించిన భలే దొంగలు, మసాలా సినిమాలు అంచనాలు అందుకోలేదు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా చేసిన ప్రేమ కావాలి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి మంచి హిట్ చిత్రంగా నిలిచింది.
మసాలా తర్వాత కొన్నేళ్లు పాటు విజయ్ భాస్కర్ సినిమాలు చేయడం లేదు.పైగా త్రివిక్రమ్ దర్శకుడు అయిన తర్వాత విజయ్ భాస్కర్ పూర్తిగా ఫేడవుట్ అయిపోయారు. ఈయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే కొడుకు, కూతురు ఉన్నారు. ఈయన వారసుడు త్వరలోనే హీరోగా 2024లో ఉషా పరిచయం చిత్రాన్ని తీసినా అది పెద్దగా ఆడలేదు. విజయ్ భాస్కర్ అల్లుడు రవి శివ తేజ పైలా. వెబ్ సిరీస్‌లతో పాటు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుంటారు.అలాగే, పలు చిత్రాల్లో కూడా తళుక్కున మెరిశారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లిన్ కామెడీతో కూడిన చిత్రాలను తెరకెక్కించిన ఘనత విజయ భాస్కర్ కి దక్కుతుంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!