మైసా పాన్ ఇండియా ఫిల్మ్ గ్రాండ్ లాంచ్
- July 27, 2025
నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' అనే పవర్ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మైసా ఈ రోజు పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. దీనికి కోర్ టీం హాజరయ్యారు. సురేష్ బాబు క్లాప్ కొట్టారు. రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మొదటి షెడ్యూల్లో రష్మిక టీంలో జాయిన్ కానుంది.
మైసా గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవాతర్ లో కనిపిస్తుంది.
ఈ చిత్రానికి సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. యాక్షన్ ని ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు. మిగతా టెక్నిషియన్స్ విషయంలో సర్ప్రైజెస్ వుంటాయి. మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో రివీల్ చేయబోతున్నారు. మరిన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ రానున్నాయి.
తారాగణం: రష్మిక మందన్న
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లె
నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్
డీవోపీ: శ్రేయాస్ పి కృష్ణ
స్టంట్స్: ఆండీ లాంగ్
PRO: వంశీ-శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..