టెస్లాకి పోటీగా ఎంట్రీ ఇచ్చిన ‘విన్‌ఫాస్ట్’!
- July 27, 2025
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పోటీ వేడెక్కుతోంది. ఇటీవలే టెస్లా కంపెనీ భారత్‌లో తన వాహనాల అమ్మకాలు ప్రారంభించింది.ఇప్పుడు వియత్నాం దిగ్గజ సంస్థ విన్‌ఫాస్ట్ కూడా రంగప్రవేశం చేసింది.విన్‌ఫాస్ట్ భారతదేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. గుజరాత్‌లోని సూరత్‌లో మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది.ఈ షోరూమ్‌లో కంపెనీ వీఎఫ్ 6, వీఎఫ్ 7 అనే ఎలక్ట్రిక్ SUV మోడళ్లను ప్రదర్శించింది. జూలై 15 నుంచి ఈ రెండు మోడళ్లకు రూ.21,000 రిఫండబుల్ డిపాజిట్‌తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
భారత్‌ను వ్యూహాత్మక హబ్‌గా చూస్తున్న విన్‌ఫాస్ట్
విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌ను భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కేంద్రంగా భావిస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ప్లాంట్‌ను నిర్మించి వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేయాలని యోచిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి విన్‌ఫాస్ట్ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రోడ్‌గ్రిడ్, మైటీవీఎస్, గ్లోబల్ అస్యూర్ సంస్థలతో కలిసి ఛార్జింగ్ మరియు ఆఫ్టర్‌సేల్స్ సదుపాయాలు కల్పించనుంది. బ్యాటరీ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి బాట్‌ఎక్స్ ఎనర్జీస్‌తో కూడా భాగస్వామ్యం చేసింది.
సీఈవో వ్యాఖ్యలు
విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ, “సూరత్‌లో ప్రారంభమైన మా మొదటి షోరూమ్ భారత్‌పై ఉన్న నిబద్ధతను చూపిస్తుంది. భారత వినియోగదారులకు విన్‌ఫాస్ట్ అనుభవాన్ని అందించడానికి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం అన్నారు.వీఎఫ్ 6 ఒక ఎంట్రీ-లెవల్ 5 సీటర్ SUV. ఇది 59.6kWh బ్యాటరీతో ఎకో, ప్లస్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీఎఫ్ 7 కూడా 5 సీటర్ ఆల్ ఎలక్ట్రిక్ SUV. ఇందులో 70.8kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. లెవల్ 2 అడాస్, 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ లక్ష్యం
టెస్లా ప్రవేశం తర్వాత భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. విన్‌ఫాస్ట్ ఈ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్థానిక అసెంబ్లీ, విస్తృత డీలర్ నెట్‌వర్క్‌తో వినియోగదారులకు చేరువ కావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!