8 గంటల ఆపరేషన్ సక్సెస్..వేరైన సిరియన్ అవిభక్త ట్విన్స్..!!
- July 28, 2025
రియాద్ : సౌదీ సర్జికల్ టీమ్ ఎనిమిది గంటల శ్రమ సక్సెస్ అయింది. ఒక సంవత్సరం ఐదు నెలల వయస్సు గల సిరియన్ అవిభక్త కవలలు సెలిన్, ఎలిన్లను విజయవంతంగా వేరు చేశారు. రియాద్లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీలోని కింగ్ అబ్దుల్లా స్పెషలిస్ట్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఈ సంక్షిష్టమైన, అరుదైన ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో 24 మంది కన్సల్టెంట్లు, నిపుణులు పాల్గొన్నట్లు కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) సూపర్వైజర్ జనరల్, సర్జికల్ టీమ్ అధిపతి డాక్టర్ అబ్దుల్లా అల్-రబీహ్ తెలిపారు.
ఈ ఆపరేషన్ సిరియా నుండి అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేయడంలో నాల్గవది అని, సౌదీ అవిభక్త కవలల కార్యక్రమం కింద 66వది అని తెలిపారు. గత 35 సంవత్సరాలలో 27 దేశాల నుండి 150 కేసులను డీల్ చేసినట్లు వెల్లడించారు. ఈ అరుదైన ఆపరేషన్ సౌదీ అరేబియా మెడికల్ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేప్పిందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్







