ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కువైట్ మార్పులు..!!
- July 28, 2025
కువైట్: ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలకు సంబంధించిన తాజా అప్డేట్ లను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక గెజిట్ (కువైట్ టుడే) విడుదల చేసింది.
తాజా సవరణ ప్రకారం.. ఏడుగురు కంటే ఎక్కువ మంది ప్రయాణికులు లేని ప్రైవేట్ కార్లు, రెండు టన్నులకు మించని లోడ్ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, అలాగే టాక్సీలు, అంబులెన్స్‌లను డ్రైవ్ చేయడానికి ఇప్పుడు ప్రైవేట్ లైసెన్స్‌ను ఉపయోగించవచ్చు. రెసిడెన్సీ స్థితి ఆధారంగా లైసెన్స్ చెల్లుబాటును కూడా సర్దుబాటు చేసుకోవచ్చు.
కువైట్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సిటిజన్స్.. లైసెన్స్ 15 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ప్రవాసులకు ఇది 5 సంవత్సరాలు. అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తేదీ నుండి వెంటనే అమలులోకి వచ్చే ఈ నిర్ణయం అమలును అంతర్గత వ్యవహారాల తాత్కాలిక అండర్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!