ఆగస్టులో ఫ్లిప్కార్ట్ మరో బిగ్ సేల్.. స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, స్మార్ట్ టీవీలు, రెఫ్రిజిరేటర్లు
- July 28, 2025
కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. వచ్చే ఆగస్టులో ఫ్లిప్కార్ట్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రీడమ్ సేల్ కోసం రెడీ అవుతోంది. రాబోయే ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి టాబ్లెట్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వరకు వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి.
అంతేకాదు.. ఆసక్తిగల వినియోగదారులు వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులపై ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్ సంద్భరంగా ఫ్రీడమ్ డీల్స్, రష్ అవర్ డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బంపర్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్లపై భారీ ధర తగ్గింపులు కూడా పొందవచ్చు.
ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీలివే:
ఆగస్టు 2న ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఫ్రీడమ్ సేల్ ప్రారంభమవుతుంది. అయితే, ప్లస్ యూజర్లకు ఆగస్టు 1 నుంచి ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. ఆగస్టు 2 అర్ధరాత్రి నుంచి సాధారణ యూజర్లకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుందో తేదీని ఫ్లిప్కార్ట్ ఇంకా వెల్లడించలేదు. ముఖ్యంగా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండూ వచ్చే నెలలో ఫ్రీడమ్ సేల్స్ ప్రారంభించనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సేల్ అనంతరం పండుగ సీజన్ సేల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఫ్లిప్కార్ట్ బంపర్ డిస్కౌంట్లు:
ఫ్లిప్కార్ట్ VIP, ప్లస్ యూజర్ల కోసం ఆగస్టు 2 నుంచి సేల్ ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు ఒక రోజు ముందు సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ సమయంలో కస్టమర్లు అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్లపై 15 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్ లేదా క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఇంకా, ప్లస్, VIP సభ్యులు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
78వ స్వాతంత్య్ర దినోత్సవ డీల్స్, ఆఫర్లు:
ఫ్లిప్కార్ట్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. వాల్మార్ట్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ 78 ఫ్రీడమ్ డీల్స్ అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సేల్ ప్రొడక్టుల కొనుగోళ్లపై 78శాతం వరకు డిస్కౌంట్ అందించే అవకాశం ఉంది. అయితే, కంపెనీ ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ముగిసిన ఫ్లిప్కార్ట్ GOAT సేల్లో ఆపిల్ ఐఫోన్ 16, నథింగ్ ఫోన్ (3a), శాంసంగ్ గెలాక్సీ S24 వంటి మిడ్-రేంజ్, ఫ్లాగ్షిప్ మోడల్లతో సహా వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







