అల్ దహిరా గవర్నరేట్ లో 18 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ డ్యామ్స్..!!

- July 28, 2025 , by Maagulf
అల్ దహిరా గవర్నరేట్ లో 18 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ డ్యామ్స్..!!

ఇబ్రి: వ్యవసాయం, మత్స్య, జల వనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో అల్ దహిరా గవర్నరేట్ విలాయత్‌లలోని సిటిజన్ కమ్యూనిటీ భాగస్వామ్య ప్రాజెక్టులో భాగంగా 18 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ డ్యామ్స్ నిర్మాణం చేపడుతున్నారు.  ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాల నిల్వలను పెంచడం , భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. జల వనరుల నిర్వహణ రంగంలో సమగ్ర ప్రయత్నాల విజయాన్ని ప్రతిబింబించే క్రమంలో ఆనకట్టల నిర్మాణానికి స్థానిక పౌరులు, మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చుతున్నాయని అల్ దహిరా గవర్నరేట్‌లోని జల వనరుల శాఖ డైరెక్టర్ ముబారక్ సలీం అల్ జాబ్రీ తెలిపారు.

కమ్యూనిటీ భాగస్వామ్య చొరవలో భాగంగా 7 కొత్త భూగర్భ జలాల రీఛార్జ్ డ్యాములు నిర్మించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. ఇబ్రి విలాయత్‌లో 3 డ్యామ్స్, యాంకుల్ విలాయత్‌లో 3 డ్యామ్స్, ధంక్ విలాయత్‌లో 1 డ్యామ్స్ ఈ ప్రాజెక్టు ఖర్చులో మంత్రిత్వ శాఖ 20 శాతం వాటాను అందిస్తుందన్నారు. మిగిలిన 80 శాతాన్ని పౌరులు భరిస్తారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అల్ దహిరా గవర్నరేట్‌లో ఉన్న 8 డ్యామ్స్ నిర్వహణ కూడా పూర్తయిందని అల్ జబ్రీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com