కువైట్ లో డ్రైవర్లపై నిఘాకు మొబైల్ రాడార్లు..!!
- July 28, 2025
కువైట్: కువైట్ అంతటా రహదారులపై డ్రైవర్లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నారు. మొబైల్ రాడార్ పనితీరును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పర్యవేక్షిస్తోంది. ఫలితంగా 118 మంది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. ముగ్గురు వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ప్రచారంలో ట్రాఫిక్ వ్యవహారాలు, కార్యకలాపాల యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ జమాల్ అల్-ఫౌదారి సహా పలువురు ట్రాఫిక్ విభాగ డైరెక్టర్లు పాల్గొన్నారు.
వేగ పరిమితులను దాటిన డ్రైవర్లను పట్టుకోవడంపై ఈ ప్రచారం సందర్భంగా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఇస్సా తెలిపారు. ట్రాఫిక్ చట్టాలను అమలు చేయడంతోపాటు రహదారి భద్రతను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా, వేగవంతమైన వాహనాలను పర్యవేక్షించడానికి మొబైల్ రాడార్ పరికరాలను ఉపయోగించినట్లు పేర్కొన్నారు.
ఇటువంటి ట్రాఫిక్ ప్రచారాలు నిరంతరం కొనసాగుతాయని కల్నల్ అల్-ఇస్సా చెప్పారు. వాహనదారులందరూ వేగ పరిమితులను గౌరవించాలని, అందరికీ సురక్షితమైన రోడ్లను అందించడంలో సహాయపడటానికి ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







