షార్జాలో భారతీయ మహిళ ఆత్మహత్య.. ఫోరెన్సిక్ నివేదిక..!!
- July 29, 2025
యూఏఈః షార్జాలో భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. షార్జా అధికారులు జారీ చేసిన ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. తన 30వ పుట్టినరోజు తర్వాత షార్జా అపార్ట్మెంట్లో మృతి చెందిన అతుల్య శేఖర్ మరణం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారని సామాజిక కార్యకర్త అబ్దుల్లా కమంపాలం తెలిపారు.
కేరళకు చెందిన అతుల్య జూలై 19 ఉదయం రోల్లా ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. అతుల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేరళలో ఆమె భర్తపై శారీరక వేధింపులు, వరకట్న వేధింపులు, హత్య వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని కమంపాలం చెప్పారు.
అతుల్య గత రెండు సంవత్సరాలుగా షార్జాలో నివసిస్తుంది. ఆమె తన సోదరితో కలిసి తన పుట్టినరోజును జరుపుకుంది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని కేరళకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కమంపాలం వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!