సౌదీ అరేబియా, పాలస్తీనా మధ్య మూడు కీలక అవగాహన ఒప్పందాలు..!!
- July 30, 2025
న్యూయార్క్ః సౌదీ అరేబియా, పాలస్తీనాలు మూడు కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, పాలస్తీనా ప్రధాన మంత్రి డాక్టర్ మొహమ్మద్ ముస్తఫా ఒప్పందాలపై సంతకాలు చేశారు. పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం, టూ-స్టేట్స్ పరిష్కారం అంశంపై న్యూయార్క్ లో జరిగిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఒప్పందాలపై సంతకాలు చేశారు.
మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి మొదటి ఒప్పందంపై సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పాలస్తీనా జనరల్ పర్సనల్ కౌన్సిల్ సంతకం చేశారు. విద్యా సంస్కరణలలో సౌదీ అరేబియా అనుభవాన్ని ఉపయోగించుకోవడం, పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న రెండవ ఒప్పందంపై సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ - పాలస్తీనా విద్య ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సంతకం చేశాయి.
డిజిటల్, ICT సహకారంపై దృష్టి సారించిన మూడవ ఒప్పందం సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ -పాలస్తీనా కమ్యూనికేషన్స్, డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖ మధ్య సంతకం చేశాయి. ఈ ఒప్పందాలు సౌదీ -పాలస్తీనా మధ్య లోతైన సోదర సంబంధాలను ప్రతిబింబిస్తాయన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!