నల్గురు సౌదీ మహిళలు రియో ఒలింపిక్స్ లో వెలగనున్నారు

- July 16, 2016 , by Maagulf
నల్గురు సౌదీ మహిళలు రియో ఒలింపిక్స్ లో  వెలగనున్నారు

నల్గురు మహిళా సౌదీ క్రీడాకారులు ఆగస్టు 5 న ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్లో పాల్గొననున్నారు. సౌదీ ఒలింపిక్స్ కమిటీ రియో లో పాల్గొనేవారి  పేర్లు ఖరారు చేసింది. సారా అల్ అత్తరు లుబ్న అల్ ఆమిర్  , కెరిమం  అబూ అల్ జాడైల్  మరియు వుజూడ్  ఫాహ్మి  ఈ నల్గురు సౌదీ మహిళలు ఎంపిక కాబడ్డారు.  ఇందులో సారా అల్ అత్తరు ఈమె 2012 లండన్ లో  ఒలింపిక్స్ లో  మారథాన్ పరుగు పందెంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. లుబ్న అల్ ఆమిర్ కత్తి యుద్ధంలో  పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కెరిమం  అబూ అల్ జాడైల్ 100 మీటర్ల రేసులో పాల్గొననున్నారు. వుజూడ్  ఫాహ్మి  52 కిలోల  విభాగంలో  జూడోలో తన ప్రతిభను చూపనున్నారు. దాల్మా  మెల్లీస్ మరొక సౌదీ మహిళా క్రీడాకారిణి ఈమె  కూడా ఒలింపిక్స్ ఈ సంవత్సరం హాజరవుతున్నారు. ఆమె సింగపూర్ యొక్క 2010 ఈక్వెస్ట్రియన్ కార్యక్రమాల్లో యువత కేటగిరిలో ఒక అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న తొలి సౌదీ మహిళ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com