11 కేజీల 400 గ్రాముల బంగారం చోరీ...

- July 30, 2025 , by Maagulf
11 కేజీల 400 గ్రాముల బంగారం చోరీ...

హిందూపురం: దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న హిందూపురం తూముకుంటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీ ఘటనలో మొ త్తం బంగారు ఆభరణాలు 11 కేజీల 400 గ్రాములు చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారులు లెక్కలు తేల్చారు.వీటి విలువ 13కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా నగదు రూ.37.92 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. దోపిడీ ఘటన సమాచారం వచ్చిన ప్పటి నుంచి రెండు రోజులుగా బ్యాంకు వద్ద డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. కుద వపెట్టిన బంగారు ఆభరణాలు ఒక్కోటి ఒక్కో క్యారెట్ టచ్లు ఉంటాయని కావున బంగారు ఆభరణాలు విలు వ రూ.9.57కోట్లు ఉండవచ్చని ఎఫ్ఎఆర్లో నమోదు చేశారు.

బ్యాంకు వద్ద మంగళవారం (Tuesday) డిఎస్పి విలేక రులతో మాట్లాడుతూ సేఫ్ లాకర్లో ఉంచిన భారీ నగదు బంగారు ఆభరణాలు చోరీ చేసిన దుండగులు లాకర్ దిగువ భాగంలో ఉన్న మరో పెట్టెను తేరిచేందుకు విఫలయత్నం చేశారని చెప్పారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచేందుకు ప్రయత్నించిన అది అందకపోవడంతో ఫలితం వారికి దక్కలేదన్నారు. దీనివల్ల ఈ లాకర్లో ఉన్న మరో 10 కేజీల బంగారం చోరీకి గురికాకుండా కాపాడబడిందని చెప్పారు. ఇదిలా ఉండగా దోపిడీ కావడానికి బ్యాంక్ అధికారుల నిర్లక్షమే కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రెండు నెలల కిందట సిఐ బ్యాంకు ను పరిశీలించినప్పుడు డైనింగ్ హాల్కు అనుకుని ఉన్న కిటికీని భద్రత దృష్ట్యా మూసి వేసి గోడ కట్టాలని సూచించారు. ఆ కిటికీలోంచి దొం గలు సునాయాసంగా బ్యాంకులో చొరబడే ప్రమాదం ఉందని సిఐ హెచ్చరించారు. అయినప్పటికీ బ్యాంక్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరి గింది.అంతేకాకుండా నాలుగేళ్లుగా సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com