రష్యాను తాకిన సునామీ.. అమెరికా, జపాన్ హెచ్చరికలు..!!

- July 30, 2025 , by Maagulf
రష్యాను తాకిన సునామీ.. అమెరికా, జపాన్ హెచ్చరికలు..!!

రష్యాలోని ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింద. భారీగా భవనాలు దెబ్బతిన్నాయి.  4 మీటర్ల ఎత్తులో సునామీ ఆలలు ఎగిసిపడుతున్నాయి.  పసిఫిక్ మహాసముద్రం అంతటా హెచ్చరికలు జారీ చేశారు.  రష్యా తీరప్రాంతాన్ని సునామీ ఆలలు తాకాయి. అనేక భవనాలు నేలకూలాయ. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. 2011లో శక్తివంతమైన భూకంపం, సునామీ కారణంగా జపాన్ తూర్పు సముద్ర తీరంలో ఎక్కువ భాగం ఖాళీ చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

 "నేటి భూకంపం తీవ్రమైనది.  దశాబ్దాల ప్రకంపనలలో అత్యంత బలమైనది" అని కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 

కమ్చట్కాలోని కొన్ని ప్రాంతాల్లో 3-4 మీటర్లు (10-13 అడుగులు) ఎత్తుతో సునామీ సంభవించిందని అత్యవసర పరిస్థితుల ప్రాంతీయ మంత్రి సెర్గీ లెబెదేవ్ తెలిపారు. ప్రజలు తీరప్రాంతం నుండి దూరంగా వెళ్లాలని ఆయన కోరారు.

భూకంపం 19.3 కి.మీ లోతులో ఉందని, 165,000 జనాభా కలిగిన పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీకి తూర్పు-ఆగ్నేయంగా 119 కి.మీ (74 మైళ్ళు) కేంద్రీకృతమై ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.  మరోవైపు, జపాన్ వాతావరణ సంస్థ తన హెచ్చరికను అప్‌గ్రేడ్ చేసింది.  0100 GMT నుండి పెద్ద తీర ప్రాంతాలకు 3 మీటర్లు (10 అడుగులు) వరకు సునామీ అలలు చేరుకుంటాయని అంచనా వేసింది. జపాన్ పసిఫిక్ తీరప్రాంతంలోని తీరప్రాంత పట్టణాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవాలని కోరారు.

 రష్యా, ఈక్వెడార్‌లోని కొన్ని తీరాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు అలలు చేరుకుంటాయని.. జపాన్, హవాయి, చిలీ, సోలమన్ దీవులలో 1-3 మీటర్ల ఎత్తులో అలలు వస్తాయన్నారు.  

"పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా, హవాయిలో నివసించే వారికి సునామీ హెచ్చరిక అమలులో ఉంది" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. తాజా సమాచారం కోసం దయచేసి sunami.gov/ ని సందర్శించాలని సూచించారు.  కాగా, కొన్ని తీర ప్రాంతాల నుండి ఖాళీ చేయమని హవాయి అధికారులు హెచ్చరించారు. 

'రింగ్ ఆఫ్ ఫైర్'
కమ్చట్కా,  రష్యా ఫార్ ఈస్ట్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి.  ఇది భూకంపాలు , అగ్నిపర్వత విస్ఫోటనాలకు గురయ్యే భౌగోళికంగా చురుకైన ప్రాంతం. 1952 తర్వాత ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత బలమైన భూకంపం ఇదని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com