మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ పాటించిన 99.8 శాతం కంపెనీలు

- July 16, 2016 , by Maagulf
మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ పాటించిన 99.8 శాతం కంపెనీలు

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ వివరాల ప్రకారం 99.8 శాతం కంపెనీలు మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ని నిబంధనలకు అనుగుణంగా పాటించినట్లు తెలుస్తుంది. 29,185 కంపెనీలు జులై మధ్యంతరం నాటికి పూర్తిగా ఈ మిడ్‌ డే బ్రేక్‌ని పాటించాయనీ, 47 సంస్థలు మాత్రం ఆ రూల్‌ని అతిక్రమించాయని పేర్కొంది మినిస్ట్రీ. 29,232 తనిఖీల్ని మొత్తం 18 టీమ్‌లు ఈ కాలంలో నిర్వహించాయి. మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ని పాటించిన సంస్థలను మినిస్ట్రీ అభినందించింది. అలాగే రూల్‌ని అతిక్రమించిన సంస్థలకు ఒక్కో వర్కర్‌కిగాను 5,000 దిర్హామ్‌ల ఫైన్‌ విధించింది. ఈ ఫైన్‌ 50,000 దిర్హామ్‌ల వరకు ఉంటుంది. రోజువారీ పనిదినాలు 8 గంటలకు మించి ఉండకూడదనీ, ఓవర్‌టైమ్‌ అలవెన్స్‌లను కార్మికులకు తప్పనిసరిగా చెల్లించాలని అధికారులు చెప్పారు. బ్యాన్‌ చేసిన సమయాల్లో కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచెయ్యకూడదని, సంస్థలు ఈ విషయంలో కార్మికులకు సహకరించాలని మినిస్ట్రీ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com