కొత్త సర్వీస్..PACI సహెల్ యాప్ ద్వారా ఫోటో అప్‌డేట్‌..!!

- July 31, 2025 , by Maagulf
కొత్త సర్వీస్..PACI సహెల్ యాప్ ద్వారా ఫోటో అప్‌డేట్‌..!!

కువైట్: “సహెల్” ప్రభుత్వ అప్లికేషన్ ద్వారా పౌరులు, నివాసితులు తమ వ్యక్తిగత ఫోటోలను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు కొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) తెలిపింది. ఇప్పుడు PACI కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్‌గా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ అప్డేట్ విలువైన సమయాన్ని తగ్గిస్తుందని, విధానాలను ఈజీ చేస్తుందని, పౌర సేవల మొత్తం సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించారు.

ఎలా పనిచేస్తుందంటే:

  • మీ పర్సన్ ఫోటోను అప్డేట్ చేసుకోవడానికి, సహల్ యాప్ ద్వారా ఈ దశలను అనుసరించండి:
  • యాప్‌ను యాక్సెస్ చేసి “వ్యక్తిగత సేవలు” విభాగానికి నావిగేట్ అవ్వండి.
  • ప్రొఫైల్ ఫోటో యాడ్ లేదా అప్డేట్ ను ఎంపిక చేసుకోవాలి.
  • ఇటీవలి పర్సనల్ ఫోటో, మీ సివిల్ ID కాపీతో సహా అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయండి.
  • మీ అభ్యర్థనను సమర్పించాలి. దరఖాస్తు సంఖ్యను నమోదు చేసుకోవాలి.
  • మీ దరఖాస్తును PACI పరిశీలిస్తుంది. అనంతరం ధృవీకరిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అందుతుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com