మోడ్రన్ ఆర్కిటెక్చర్.. అరబ్ హెరిటేజ్ జాబితాలో కువైట్ టవర్లు..!!

- July 31, 2025 , by Maagulf
మోడ్రన్ ఆర్కిటెక్చర్.. అరబ్ హెరిటేజ్ జాబితాలో కువైట్ టవర్లు..!!

కువైట్: అరబ్ ఆర్కిటెక్చరల్, అర్బన్ హెరిటేజ్ అబ్జర్వేటరీ అధికారికంగా కువైట్ టవర్లను ఆధునిక ఆర్కిటెక్చర్ వర్గం కింద అరబ్ వారసత్వ జాబితాలో చేర్చింది. బీరూట్‌లో నిర్వహించిన అబ్జర్వేటరీ తొమ్మిదవ ప్రాంతీయ ఫోరమ్ సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ (NCCAL) నుండి ఇంజనీర్ మహమూద్ అల్-రబియా మాట్లాడుతూ.. కువైట్ టవర్లను రాష్ట్ర సాంస్కృతిక ఆస్తిగా నామినేట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనేక పురాతన, పురావస్తు వారసత్వ నిర్మాణాలతో పాటు, ఆమోదించబడిన రెండు ఆధునిక నిర్మాణ ఎంట్రీలలో టవర్లు ఒకటి అని ఆయన తెలిపారు.

కువైట్ టవర్‌లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఎంపిక చేసినట్లు కమిటీ అధిపతి ఇంజనీర్ మొహమ్మద్ అబు సాది తెలిపారు. అరబ్ ఆర్కిటెక్చరల్, అర్బన్ హెరిటేజ్ అబ్జర్వేటరీ అరబ్ లీగ్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ (ALECSO) కింద పనిచేస్తుందని, అరబ్ ప్రపంచవ్యాప్తంగా చారిత్రక, నిర్మాణ విలువలు కలిగిన ప్రదేశాలను వారసత్వ జాబితాలో చేర్చడానికి ఇవాల్యుయేట్ చేస్తుందన్నారు.లెబనీస్ సాంస్కృతిక మంత్రి గస్సన్ సలామెహ్ ఆధ్వర్యంలో.. ALECSO డైరెక్టర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ ఔల్డ్ అమర్ సమక్షంలో ఈ ఫోరమ్ నిర్వహించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com