50 శాతం తక్కవకే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ టిక్కెట్స్..!!

- July 31, 2025 , by Maagulf
50 శాతం తక్కవకే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ టిక్కెట్స్..!!

యూఏఈ: ఇండియా-యూఏఈ మధ్య విమాన ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నందున, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొన్ని ఆఫర్లను ప్రకటించాయి. టిక్కెట్ ధరలపై  50 శాతం వరకు తగ్గింపు ఆఫర్లను అందించనున్నట్ల తెలిపింది.  

జూన్ 12న అహ్మదాబాద్‌లో లండన్ గాట్విక్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI171 విషాదకరమైన క్రాష్ తర్వాత, చాలా మంది ప్రయాణికులు విమానయాన సంస్థను ఎంచుకోవడం గురించి ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు గతకొన్ని రోజులుగా కంపెనీ ఫ్లైట్స్ సర్వీసుల్లో లోపాల గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పటికి యూఏఈ-ఇండియా రూట్లో టాప్ ఎంపికల్లో ఒకటిగా ఉన్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.    

ధరల మధ్య వ్యత్యాసం    

దుబాయ్ నుండి ముంబై: ఎయిర్ ఇండియా Dh291 నుండి, ఇతర విమానయాన సంస్థలు Dh580 నుండి ధరలు ప్రారంభం అవుతన్నాయి.

దుబాయ్ నుండి చెన్నై: ఎయిర్ ఇండియా Dh734 నుండి, ఇతర విమానయాన సంస్థలు Dh1,290 నుండి ప్రారంభం.

దుబాయ్ నుండి బెంగళూరు (ఒక స్టాప్ ఓవర్): ఎయిర్ ఇండియా Dh393 నుండి, ఇతర విమానయాన సంస్థలు Dh1,140 నుండి (ప్రత్యక్ష) ప్రారంభం.

దుబాయ్ నుండి తిరువనంతపురం: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ Dh403 నుండి, ఇతర విమానయాన సంస్థలు Dh1,040 నుండి ప్రారంభం.

వైస్‌ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ సంఘటన తర్వాత కొందరు ఎయిర్‌లైన్‌తో ప్రయాణించడానికి వెనుకాడుతున్నారని అన్నారు. అయతే ఇప్పటికి ఎయిర్ ఇండియాకు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య మాత్రం తక్కవేం కాదని పేర్కొన్నారు. ధరల వ్యత్యాసం కారణంగా అనేక మంది బడ్జెట్ ప్రయాణికులు ఎయిర్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com