సర్కార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!

- July 31, 2025 , by Maagulf
సర్కార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!

చెన్నై: సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ లో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక ముఖ్యమైన అలర్ట్‌ను జారీ చేసింది.నాలుగు సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ తేదీలలో మార్పులు చేసినట్లు ప్రకటించింది.ఈ మార్పులు అక్టోబర్ నుండి అమలులోకి రానున్నాయి.కాబట్టి, అక్టోబర్ నెల నుండి సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలనుకునే వారు ఈ మార్పులను తప్పనిసరిగా గమనించి, తదనుగుణంగా తమ టికెట్లను బుక్ చేసుకోవాలని మరియు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రయాణ తేదీల మార్పు వివరాలు

తమిళనాడు, పుదుచ్చేరి-కాకినాడ మధ్య ప్రయాణించే సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ తేదీల్లో ఈ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా, చెంగల్పట్టు-కాకినాడ పోర్ట్ మధ్య నడిచే రైలు నంబర్ 17643/17644, అలాగే కాకినాడ పోర్ట్-పుదుచ్చేరి మధ్య నడిచే రైలు నంబర్ 17655/17656 ల ప్రయాణ తేదీలలో మార్పులు ఉంటాయి.

రైలు నంబర్ 17643 (చెంగల్పట్టు – కాకినాడ పోర్ట్): ప్రస్తుతం మంగళవారం, బుధవారం, శనివారం, ఆదివారం నడుస్తుండగా, అక్టోబర్ 3 నుండి మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం నడుస్తుంది.

రైలు నంబర్ 17644 (కాకినాడ పోర్ట్–చెంగల్పట్టు): ప్రస్తుతం సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం నడుస్తుండగా, అక్టోబర్ 3 నుండి మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం ప్రయాణించనుంది.

రైలు నంబర్ 17655 (కాకినాడ పోర్ట్ – పుదుచ్చేరి): ప్రస్తుతం బుధవారం, గురువారం, ఆదివారం నడుస్తుండగా, అక్టోబర్ 4 నుండి సోమవారం, గురువారం, శనివారాల్లో నడుస్తుంది.

రైలు నంబర్ 17656 (పుదుచ్చేరి – కాకినాడ పోర్ట్): ప్రస్తుతం సోమవారం, గురువారం, శుక్రవారం నడుస్తుండగా, అక్టోబర్ 2 నుండి సోమవారం, గురువారం, శనివారం నడుస్తుంది.

ప్రయాణికులకు సూచనలు

సర్కార్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఈ మార్పులను తప్పకుండా గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలి. అయితే, ఈ సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కేవలం ప్రయాణ తేదీలలో మాత్రమే మార్పులు ఉంటాయని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com