తెలంగాణ–ఈశాన్య మహోత్సవం కోసం లోగో, ట్యాగ్‌లైన్, పోస్టర్ డిజైన్‌కు రాజ్‌భవన్ ఆహ్వానం
- August 01, 2025
హైదరాబాద్: "తెలంగాణ–ఈశాన్య భారత సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం" కోసం లోగో రూపకల్పన, ట్యాగ్‌లైన్ రచన, పోస్టర్ తయారీకి రాజ్‌భవన్ నుండి ఆహ్వానం.
రాజ్ భవన్ తెలంగాణ, రానున్న"తెలంగాణ–ఈశాన్య భారత సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం" సందర్భంగా,వ్యక్తులు, విద్యార్థులు,కళాకారులు,డిజైనర్లు మరియు మాన్య ప్రజానికం నుండి లోగోలు, ట్యాగ్ లైన్లు, పోస్టర్లకు గాను ఈ పోటీని ఏర్పాటుచేస్తుంది.
ఈ మహోత్సవం తెలంగాణ రాష్ట్రం మరియు ఈశాన్య భారతంలోని 8 రాష్ట్రాల (అరుణాచలప్రదేశ్,అస్సాం,మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపురా) మధ్య సాంకేతికం మరియు సాంస్కృతిక పరిజ్ఞాన మార్పిడి, ఆర్ధిక సంబంధాల అభివృద్ధి లక్ష్యంగా, 2025 నవంబర్ 25 నుండి 27 వరకు మరియు డిసెంబర్ 2 నుండి 4 వరకు రెండు దశల్లో హైదరాబాద్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి పై రాష్ట్రాలకు చెందిన సాంకేతిక మరియు సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు.
పోటీ విభాగాలు:
1. లోగో రూపకల్పన
2. ట్యాగ్‌లైన్ రచన
3. పోస్టర్ రూపకల్పన (A4 లేదా A3 పరిమాణంలో, డిజిటల్ ఫార్మాట్‌లో)
థీమ్ లక్ష్యం:
తెలంగాణ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, సాంకేతిక ఆవిష్కరణల పరస్పర మార్పిడి భావనలను ప్రతిబింబించేలా ఎంట్రీలు ఉండాలి.
అర్హత:
ఈ పోటీకి భారతదేశ పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు.
సబ్మిషన్ మార్గదర్శకాలు:
లోగో: స్వంతంగా రూపొందించబడిన,ఎడిట్ చేయగలిగే (AI/CDR/PSD), హై-రెసల్యూషన్ లో మరియు PNG ఫార్మాట్‌లో సమర్పించాలి.
ట్యాగ్‌లైన్: ఇంగ్లిష్‌లో, 10 పదాలకు మించకుండా, ప్రభావవంతంగా, ఒరిజినల్ గా ఉండాలి.
పోస్టర్: థీమ్‌కు అనుగుణంగా, ఆకర్షణీయంగా ఉండాలి.PDF లేదా PNG ఫార్మాట్‌లో, కనీసం 300 dpi రిజల్యూషన్‌తో సమర్పించాలి.
ఎలా పంపించాలి:
మీ వివరాలతో కూడిన entries ను ఈ దిగువ మెయిల్‌కు పంపాలి:
Email ID: [email protected]
Subject line: Entry for Logo/Tagline/Poster–[మీ పేరు]
చివరి తేదీ:
• 15 ఆగస్ట్ 2025
ప్రతి ఎంట్రీతో పాటుగా పూర్తి పేరు,వయస్సు,వృత్తి, మొబైల్ నంబర్,ఈమెయిల్, గుర్తింపు లేదా చిరునామా ఆధారాల ఫోటోకాపీ,మరియు మీ డిజైన్/ట్యాగ్‌లైన్/పోస్టర్ వెనక ఉన్న భావనపై 50–100 పదాల వివరణ తప్పనిసరిగా ఇవ్వాలి.
బహుమతులు:
• ఉత్తమ లోగో రూపకల్పన–₹15,000
• ఉత్తమ ట్యాగ్‌లైన్–₹5,000
• ఉత్తమ పోస్టర్ రూపకల్పన–₹20,000
మరిన్ని వివరాలకు: రాజ్‌భవన్ వెబ్‌సైట్ http://www.governor.telangana.gov.in ను సందర్శించండి.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







